కళంకితమంత్రులకై చర్చకు సిద్ధం: ప్రధాని
న్యూఢిల్లీ:కళంకిత మంత్రులుగా పేర్కొంటున్నవారిపై చర్చకు తాము సిద్ధమని ప్రధానిమన్మోహన్ సింగ్ శనివారం స్పష్టం చేశారు. కేంద్రమంత్రిలాలూ ప్రసాద్ లోక్‌సభలో బడ్జెట్‌సమర్పిస్తున్న సందర్భంగా కళంకితమంత్రులపై చర్చ ప్రారంభించాలని ఎన్డీయేపక్షాలు చేసిన డిమాండ్‌ను స్పీకర్‌తోసిపుచ్చటంతో సభ నుంచి ప్రతిపక్షాలకువాకౌట్ చేశాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకునికళంకిత మంత్రులపై జరిగే ఎటువంటిచర్చకైనా తాము సిద్ధమేనని ప్రధానిమన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు. లాలూప్రసాద్ బడ్జెట్ సమర్పించిన అనంతరంసభ బయట మన్మోహన్ విలేకరులతోమాట్లాడారు. కళంకిత మంత్రుల అంశంపైచర్చకు తాము భయపడటం లేదని చెప్పారు.ఎటువంటి అంశాన్నైనా చర్చించటానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.పార్లమెంట్‌లోకళంకిత మంత్రుల అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల సుప్రీంకోర్టుకుకేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాతఎన్డీయే ప్రతిపక్షాలు ఈ అంశంపై చర్చకుడిమాండ్ చేశాయి.












Click it and Unblock the Notifications