దళితులపై పోలీసుల లాఠీఛార్జీ, అరెస్టులు
హైదరాబాద్: దళితులపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. కులవివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో దళితులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు లాఠీచార్జి, అరెస్టులతో భగ్నం చేశారు. దళితులు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ నుంచి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ ప్రారంభమైన చోటు నుంచి విడతలు విడతలుగా పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. తరిమి కొట్టారు. రోడ్డు మీద పడిపోయినవారిని కూడా వదలకుండా బాదారు. ముఖ్యనాయకులను ఈడ్చుకుపోయి వ్యాన్‌ల్లో కుక్కారు.












Click it and Unblock the Notifications
