జార్ఖండ్‌లో విశ్వాసపరీక్ష నెగ్గిన ముండా ప్రభుత్వం
రాంచి:జార్ఖండ్‌అసెంబ్లీలో అర్జున్ ముండా ప్రభుత్వంవిశ్వాసపరీక్షను సునాయాసంగా నెగ్గింది.అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో ఉన్న ఎన్.సి. పి ఎమ్మెల్యే కమలేశ్ సింగ్ సహాఇద్దరు యు. పి. ఎ ఎమ్మెల్యేలు సభకు హాజరుకానప్పటికీబలపరీక్షలో ముండా మంగళవారంవిజయం సాధించారు. స్పీకర్‌గా ఎన్. డి. ఎఅభ్యర్థి నామ్‌ధారి ఎన్నిక కూడా నల్లేరులోనత్తనడకలా సాగటంతో జార్ఖండ్‌లోపక్షం రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికితెరపడింది. సభ సమావేశం కాగానేమూజువాణి వోటుతో స్పీకర్‌గా నామ్‌ధారిఎన్నికయ్యారు.స్పీకర్ ఎన్నికను నిరసిస్తూ కాసేపు ప్రతిపక్షసభ్యులు రభస సృష్టించారు. పావు గంట విరామం తరువాత బలపరీక్షనిర్వహించాలని ముఖ్యమంత్రి అర్జున్ ముండాకునూతన స్పీకర్ అనుమతి జారీ చేశారు.అర్జున్‌ముండాకు మద్దతిచ్చే వారు చేతులుపై కెత్తాలని ఆదేశించారు. 40 ఓట్లతో ముండాప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని నెగ్గినట్లు ప్రకటించారు.ఎన్. సి. పి సభ్యుడు కమలేశ్ సింగ్‌తోపాటు జోబా మంఝి (యుజిడిపి), సుఖ్‌రాం ఓరాన్(జెఎంఎం)సభకు హాజరుకాకపోయినా ముండాకుతగినంత మెజారిటీ లభించిందని స్పీకర్‌ప్రకటించారు.












Click it and Unblock the Notifications
