రైతులపై ఘోష్‌నివేదికను చర్చకు పెడతాం: మంత్రి
హైదరాబాద్:రైతుల సమస్యలపై జయతీ ఘోష్ సమర్పించిన నివేదికపై మంత్రివర్గ సమావేశం జరిగిన అనంతరం అసెంబ్లీలో చర్చకుపెడతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు. ఈకమిషన్ సమర్పించిన నివేదికను మంత్రివర్గ ఉపసంఘం ప్రస్తుతం చర్చిస్తోందని ఆయన వెల్లడించారు. వ్యవసాయంతో పాటు గ్రామీణపరిశ్రమలను ప్రోత్సహిస్తామని ఆయనతెలిపారు. రైతులఆత్మహత్యలపై మంగళవారంఅసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులుఆందోళన వ్యక్తం చేశారు. రైతులఆత్మహత్యలని నివారించడంలోప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదనితెలుగు దేశం ఎమ్మెల్యే పయ్యావులకేశవ్ విమర్శించారు. రాష్ట్రంలోని అనేకజిల్లాల నుంచి లక్షలాది ప్రజలు పెద్ద ఎత్తునవలపోతున్నారని ఆయన అన్నారు. అయినాప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని కేశవ్‌విమర్శించారు. చిత్తూరు జిల్లాను కరువు మండలంగా ప్రకటించాలని చంద్రగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే గల్లాఅరుణ కుమారి కోరారు.












Click it and Unblock the Notifications
