అక్రమ మెడికల్ షాపులపై కఠిన చర్యలు: మంత్రి
హైదరాబాద్: అక్రమ మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి కె. రోశయ్య చెప్పారు. శాసనసభ్యులు గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. బినామీ పేర్లతో నడుస్తున్న 690 మెడికల్ షాపుల లైసెన్స్‌లు రద్దు చేసినట్లు మంత్రి తెలిపారు. మెడికల్ షాపుల తనిఖీకి అదనంగా కాంట్రాక్టు పద్ధతిపై 50 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లును నియమిస్తామని ఆయన చెప్పారు.
అరవై, డెబ్బై శాతం మెడికల్ షాపులు బినామీ పేర్లతో నడుస్తున్నాయని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని సభ్యులు అన్నారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉన్నదని జి. కిషన్ రెడ్డి (బిజెపి) అన్నారు. మెడికల్ షాపుల్లో నాసిరకం మందులు అమ్ముతున్నారని ఆయన ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.












Click it and Unblock the Notifications