అసెంబ్లీలోమునిసిపల్ బదిలీ ముడుపుల రభస
హైదరాబాద్:మునిసిపల్‌శాఖలో బదిలీల వ్యవహారంలోపెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందనితెలుగుదేశం సభ్యులు శనివారం అసెంబ్లీలోవ్యాఖ్యానించారు. కేవలం పత్రికల్లో వచ్చినఊహాజనిత వార్తల ఆధారంగా తమపైఆరోపణలు చేయడం సమంజసంగా లేదనిముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, మునిసిపల్‌శాఖ మంత్రి కోనేరు రంగారావు తిప్పికొట్టారు.బదిలీల సమయంలో మామూళ్ళుమామూలేనని మంత్రి కోనేరు రంగారావువ్యాఖ్యానించడం టీవీ ఛానళ్ళలోప్రసారమైందని తెలుగుదేశంసభ్యులు ప్రస్తావించారు. ఆరోపణలపై ఎటువంటివిచారణకైనా సిద్ధమని ముఖ్యమంత్రిఅన్నారు.
సర్వశిక్షాఅభియాన్‌పై సభాసంఘం
విద్యాశాఖఆధ్వర్యంలోని సర్వశిక్షా అభియాన్‌లో 1998నుంచి 2002 వరకు కంప్యూటర్ల కొనుగోలులోఅక్రమాలు జరిగాయని కాంగ్రెస్‌శాసనసభ్యుడు పి. జనార్ధనరెడ్డిఆరోపించగా, దీనిపై సభా సంఘంతో విచారణజరిపించనున్నట్టు ప్రాధమిక విద్యా శాఖ మంత్రినేదురుమల్లి రాజ్యలక్ష్మిసమాధానమిచ్చారు. తెలుగుదేశంహయాంలో భారీగా నిధులుదుర్వినియోగమైనట్టు తమ దృష్టికికూడా వచ్చిందని, ఆధారాలు కూడా ఉన్నాయనిమంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications