చంద్రబాబుఆస్తులపై రాష్ట్రపతికి కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్:చంద్రబాబు నాయుడు ఆస్తులపై దర్యాప్తుజరిపించవలసిందిగా రాష్ట్రపతికిమొమొరాండం సమర్పించాలని కాంగ్రెస్‌లెజిస్లేచర్ పార్టీ నిర్ణయించింది.మొమొరాండంపై ఎమ్మెల్యేల సంతకాలసేకరణను సిఎల్పీ నాయకులు ప్రారంభించారు.చంద్రబాబు ఆదాయానికి మంచి ఆస్తులు కలిగిఉన్నారని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించవలసిందిగాఎసిబి కోర్టును లక్ష్మీపార్వతి అభ్యర్ధించడం,చంద్రబాబు నాయుడు న్యాయవాది హైకోర్టునుంచి స్టే తీసుకురావడం తెలిసిందే.చంద్రబాబు నాయుడికి దేశంలోనే సంపన్నుడైనరాజకీయ నాయకుడిగా పేరుందని కాంగ్రెస్‌అధికార ప్రతినిధి గాలి ముద్దు కృష్ణమనాయుడువ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుఅధికారంలో ఉండగా ఏటా దుబాయ్‌కి అక్కడినుంచి స్విట్జర్లాండ్‌కు వెళ్ళేవారని,డబ్బు దాచుకోడానికే ఆ పర్యటనలని గాలి ఆరోపించారు.












Click it and Unblock the Notifications