చెన్నైలో మధిమలార్‌తో మురళీధరన్ పెళ్లి
చెన్నై: శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ చెన్నైకి చెందిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్ మధిమలార్ మెడలో తాళి కట్టాడు. శ్రీలంక స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్, మధిమలార్‌ల వివాహం దక్షిణ భారత హిందూ సంప్రదాయం ప్రకారం సోమవారం చెన్నైలో జరిగింది.
ఈ వివాహానికి దాదాపు మూడు వేల మంది దాకా హాజరయ్యారు. భారత, శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. శ్రీలంక క్రికెట్ ప్రముఖులు జయసూర్య, అర్జున రణతుంగ, చామిండా వాస్ హాజరయ్యారు. భారత్ మాజీ క్రికెటర్లు రాబిన్ సింగ్, టి. ఎ. శేఖర్, ఆవిష్ కపూర్ తదితరులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. మురళీథరన్, మధిమాలర్‌ల వివాహం డిసెంబర్ మొదటి వారంలో నిశ్చయమైంది. మురళీథరన్ తలిదండ్రులు తమిళనాడులోని తిరుచిరాప్పల్లికి చెందినవారు. మురళీధరన్ శ్రీలంకలోని కాండీలో జన్మించాడు. 24 ఏళ్ల వయస్సు గల మధిమలార్ తన తల్లి నిత్యా రామ్మూర్తి నడిపే మలార్ ఆస్పత్రుల నిర్వహణలో తోడ్పడుతోంది.












Click it and Unblock the Notifications
