చమురు ధరలు తగ్గేది అప్పుడే.. ట్రంప్ సంచలనం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి విషయంలో ఇరు దేశాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. హార్మూజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని అమెరికా స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో ఇరాన్ పై అమెరికా విజయం సాధిస్తే చమురు ధరలు తగ్గుముఖం పడతాయని అన్నారు. గత ఐదు రోజులుగా ప్రపంచ వాణిజ్య మార్కెట్ లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరుగుతూ పోతున్నాయి.

ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై అమెరికా విజయం సాధిస్తే అమెరికాలో పెట్రోల్ ధరలు ఒక్కో గ్యాలన్ పై 2 డాలర్ల వరకు తగ్గుముఖం పడతాయని అంచనా వేశారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్టు పెట్టారు. చమురు ధరలు ప్రస్తుతం గణనీయంగా పెరుగుతున్నాయని.. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగానే ధరలు పెరుగుతున్నాయన్నారు. ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధం ఆగిపోతే అంతర్జాతీయ చమురు మార్కెట్లలో స్థిరత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

" చమురు ధరలు తగ్గుముఖం పడతాయి. ఎన్నడూ లేని విధంగా చమురు ధరలు తగ్గుతాయి. ఇరాన్ తో మనం యుద్ధం గెలిచాక ఆ మార్పు కనిపిస్తుంది. ఒక్కో గ్యాలన్ పై మూడు డాలర్లు.. లేదా రెండు డాలర్లు మేర తగ్గుతాయి. అలాగే ఇరాన్ వద్ద అణ్వాయుధాలను లేకుండా చేస్తాం. ఇది త్వరగానే జరుగుతుంది. ఇరాన్ వద్ద ఇక ఎప్పటికీ అణ్వాయుధాలు లేకుండా చేస్తాం" అని ట్రంప్ స్పష్టం చేశారు.

Trump iran Oil prices will come down if the US prevails over Iran US President Trump key remarks

చమురు ధరలు సోమవారం రోజున ఆరు వారాల గరిష్టానికి చేరుకున్నాయి. హార్మూజ్ జలసంధి కీ పాయింట్ గా ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో చమురు ధరల్లో గణనీయంగా మార్పు కనిపిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరల ప్రకారం.. ఒక్కో బ్యారెల్ ఇప్పుడు 97 డాలర్లుగా ఉంది. గత ఐదు రోజుల్లోనే ఈ ధర 9 శాతం పెరిగింది. గత నెల రోజులుగా ఇది 19 శాతం పెరిగింది. ఇక అంతకుముందు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలీబఫ్ మాట్లాడుతూ.. అమెరికాకు కీలక వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ లోని పరిశ్రమలు, ఎనర్జీ మౌలిక వసతులపై దాడులకు పాల్పడితే ప్రతి దాడులు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. అటు అమెరికా కూడా ఇరాన్ పై సంచలన హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+