LOC వెంబడి దట్టమైన అడవిలో పాకిస్థాన్ బిగ్ స్కెచ్.. భారత్ కు హై అలర్ట్..!!
భారత్- పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఉగ్రమూకలు జరిపిన దాడుల్లో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాకిస్థాన్ పై భారత్ మే 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రమూకలను హతమార్చింది. ఉగ్రవాద సంస్థలైన లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మహమ్మద్, హిజ్ బుల్ ముజాయిద్దీన్ లకు చెందిన స్థావరాలుగా భారత సైన్యం గుర్తించింది.
అయితే ఆపరేషన్ సింధూర్ లో దెబ్బతిన్న స్థావరాలను తిరిగి నిర్మించుకుంటోంది పాకిస్థాన్ ఆర్మీ. టాప్ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఆపరేషన్ సింధూర్ లో కోల్పోయిన మిలిటరీ పోస్టులను తిరిగి నిర్మించడంతో పాటుగా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూడా తిరిగి నిర్మించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. భారత్ కు చెందిన థర్మల్ ఇమేజర్స్, ఫాయిలేజ్ పెనెంట్రేటింగ్ రాడార్స్ అలాగే శాటిలైట్ సర్వీవాలెన్స్ కు చిక్కకుండా నియంత్రణ రేఖ వెంబడి దట్టమైన అడవిలో టెర్రర్ క్యాంప్స్ ను నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు తేల్చాయి. నియంత్రణ రేఖ వెంబడి లూనీ, పుట్వాల్, తాయిపు పోస్ట్, జమిలా పోస్ట్, ఉమ్రాన్ వాలీ, చప్రారర్, ఫార్వాడ్ కహుతా, చోటా చాక్, జంగ్లోరా తదితర ప్రాంతాల్లో పాకిస్థాన్ తమ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మించుకుంటున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేశాయి.

గత మూడు నెలలుగా పాకిస్థాన్ టెర్రర్ క్యాంప్స్ నిర్మాణం పనులను మరింత వేగవంతం చేసినట్లు సమాచారం. ఇక ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, సిడ్నా బిలాల్ క్యాంప్ అలాగే కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, అబ్బాస్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్ లు ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసినట్లు గతంలోనే వెల్లడించింది. ఇవి లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మహమ్మద్, హిజ్ బుల్ ముజాయిద్దీన్ లకు చెందిన స్థావరాలుగా భారత సైన్యం తేల్చింది. ఇక పాకిస్థాన్ మరోసారి తన టెర్రర్ క్యాంప్స్ ను నిర్మించుకుంటున్న తరుణంలో భారత్ అప్రమత్తం అయింది.












Click it and Unblock the Notifications
