బాల్ థాకరే పర్సనల్ అసిస్టెంట్ అరెస్టు
ముంబాయి: శివసేన అధినేత బాల్‌థాకరే పర్సనల్ అసిస్టెంట్ రవీంద్ర మాత్రేను ఆదివారంనాడు పోలీసులు అరెస్టు చేశారు. ముంబాయి శివారులోని విలే పార్లే వద్ద మాత్రే కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ కేసులో మాత్రేను పోలీసులు అరెస్టు చేశారు. 20 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై స్థానిక కోర్టు మాత్రేను బెయిల్‌పై విడుదల చేసింది.
మాత్రే నడుపుతున్న కారు అదుపు తప్పి శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో డొమెస్టిక్ ఎయిర్ పోర్టు సమీపంలో ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమైంది. కారు కింద పడి ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మాత్రే కూడా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications