పెనుకొండపై పార్టీలకు ప్రతిష్ట వద్దు: జెసి
ఏలూరు: అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభా నియోజకవర్గం అభివృద్ధి విషయంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టకు పోవద్దని రాష్ట్ర మంతి జె.సి. దివాకర్ రెడ్డి అన్నారు. ఒక్క సీటులో ఓడిపోయినంత మాత్రాన పడే తేడా ఏమీ లేదని, అందువల్ల ఫాక్షనిస్టులకు సీటు ఇచ్చి గెలుచుకోవాలని ఆశించకూడదని ఆయన ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో విలేకరులతో అన్నారు.
పెనుకొండ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ బలహీనవర్గాలవారికి ఇవ్వాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి భావిస్తున్నారని ఆయన అన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరం ఉన్నదని, ఫాక్షన్ రాజకీయాలను నిరుత్సాహపరచాల్సిన అవసరం కూడా ఉన్నదని ఆయన అన్నారు. మూడు తరాలుగా పరిటాల రవి, మద్దెలచెర్వు సూరి కుటుంబాలకు మధ్య కక్షలున్నాయని, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నదని, అందుకే బలహీనవర్గాలవారికి గానీ దళితులకు గానీ ఇరు పార్టీలు టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రతిపాదన చేశారని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications