610 జీవో అమలులో ఎవరినీ నొప్పించం: కెకె

గుంటూరు: 610 జీవో అమలు విషయంలో ఎవరినీ నొప్పించబోమని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు చెప్పారు. ఆంధ్రావారికి బాధ కలగకుండా, తెలంగాణవారికి అన్యాయం జరగకుండా 610 జీవోను అమలు చేస్తామని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఏ ప్రాంతానికీ తమ ప్రభుత్వం అన్యాయం చేయదని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఒక రోజులో వచ్చేది కాదని, తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదో కూడా చెప్పలేమని ఆయన అన్నారు. మంత్రదండం వల్లనో, స్విచ్‌ ఆన్‌ చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని, దానికి రాజ్యాంగపరమైన చర్యలు అవసరమని ఆయన అన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు సత్వరమే జరగడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

మావోయిస్టు ప్రతినిధులు వరవరరావు, గద్దర్‌, కళ్యాణ్‌రావులపై పోలీసులు కేసులు పెట్టిన విషయం తనకు తెలియదని ఆయన అన్నారు. కూంబింగ్‌లకు, చర్చలకు మధ్య సంబంధం లేదని ఆయన అన్నారు. నక్సల్స్‌ ప్రధాన డిమాండైన భూపంపిణీని ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన అన్నారు. రెండో విడత చర్చలు జరగాలంటే నక్సల్స్‌ ఆయుధాలు వీడాల్సిందేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+