ఒకే కాన్పులో ఏడుగురిని కన్న మహిళ
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక మహిళ ఒకే కాన్పులో ఏడుగురు పిల్లలను ప్రసవించింది. బోరబండకు చెందిన శిరీష అనే మహిళకు ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగశిశువులు జన్మించారు. అయితే వారు పుట్టిన ఐదు నిమిషాలకే తుది శ్వాస విడిచారు. తల్లి క్షేమంగా ఉంది.
ఒక్కో శిశువు 600 నుంచి 700 గ్రాముల బరువున్నట్లు వైద్యులు చెప్పారు. ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించడం ఉంది గానీ ఏడుగురు శిశువులు జన్మించడం చాలా అరుదని వారంటున్నారు. గర్భం చాలా పెద్దగా ఉండటంతో స్కానింగ్ చేసి ఏడుగురు శిశువులున్నట్లు గుర్తించామని వారు చెప్పారు. ఏడు నెలలకు ప్రసవం జరిగి వుంటే శిశువుల్లో ఇద్దరో ముగ్గురో బతికి ఉండేవారని వారు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో సీమా బేగం అనే మహిళ సోమవారం నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఇందులో ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు కాగా, ఇద్దరు మగశిశువులు. తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications