దండి యాత్రకు గుజరాత్ వెళ్లిన వైయస్
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మంగళవారంనాడు గుజరాత్ చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో బుధవారం జరిగే దండి ముగింపు యాత్రలో పాల్గొనడానికి ఆయన గుజరాత్ వెళ్లారు. రాజశేఖర్ రెడ్డి మూడో రోజుల పాటు రాష్ట్రంలో ఉండటం లేదు. ఆయన ఈ నెల 7వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు. ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియతో ఆయన సమావేశమవుతారు. రాష్ట్ర ప్రణాళికను ఆయన ఖరారు చేసుకునే అవకాశం ఉంది. రాజశేఖర్ రెడ్డి పెట్రోలియం శాఖ మంత్రి మణిశంకర్ అయ్యర్‌ను, ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్ని కలిసే అవకాశం ఉంది. రాజశేఖర్ రెడ్డితో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు కూడా గుజరాత్ వెళ్లారు.












Click it and Unblock the Notifications