హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో బాంబు పేలుడు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో రైల్వై ట్రాక్‌కు సమీపంలో బాంబు పేలిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ బాంబు పేలింది. బాంబు పేలిన స్థలం వంతెనకు పది, పదిహేను అడుగల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ సంఘటనలో ప్రాణాపాయమేదీ సంభవించలేదు. ఒక మేక బాంబు పేలుడులో చనిపోయింది.

మేక ఆ ప్రాంతంలో మేత కోసం సంచరిస్తుండగా బాంబు పేలినట్లు స్థానికులు చెప్పారు. మేక తునాతునకలైంది. బాంబు పేలుడు శబ్దం విన్న పక్కనే ఉన్న బస్తీకి చెందినవారు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఆ వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనపై పోలీసులు అన్ని కోణాల నుంచి పరిశీలన జరుపుతున్నారు. ఈ సంఘటనకు కారకులెవరు, కారణమేమటనే విషయాలు తెలియడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+