ఐసిసి నుంచి ఊరట: కాన్పూర్ వన్డేకు దూరమే
కోల్కత్తా: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) భారత జట్టు కెప్టెన్ సౌరబ్ గంగూలీపై ఔదార్యం చూపింది. అయినా గంగూలీ పాకిస్థాన్‌తో జరిగే కాన్పూర్ వన్డే మ్యాచ్‌కు దూరంగానే ఉంటున్నాడు. గంగూలీపై వేసిన ఆరు మ్యాచ్‌ల నిషేధం వేటను ఐసిసి రెండు మ్యాచ్‌ల కోసం తాత్కాలికంగా అపేసింది. పాకిస్థాన్, భారత జట్ల మధ్య ఐదో వన్డే శుక్రవారం కాన్పూర్‌లో జరగనుంది.
మందకొడిగా బౌలింగ్ చేసినందుకు గాను అహ్మదాబాద్ నాలుగో వన్డే ముగిసి వెంటనే గంగూలీపై ఆరు మ్యాచ్‌ల నిషేధాన్ని విధిస్తున్నట్లు ఐసిసి ప్రకటించింది. మర్నాడు ఉదయమే గంగూలీ హుటాహుటిన కోల్‌కత్తాకు వచ్చి నేరుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాకు ఇంటికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు. దీనిపై ఐసిసికి అప్పీల్ చేసుకోయాలని నిర్ణయించుకున్నారు. అప్పీల్‌ను ఐసిసికి పంపారు. విచారణకు ఐసిసి కమీషనర్ నియమించాల్సి ఉంది.
అయితే ఈలోగా గంగూలీకి వ్యతిరేకంగా కొన్ని నరిణామాలు జరిగిపోయాయి. గంగూలీపై ఐసిసి నిషేధం గురించి మౌఖిక సమాచారం అందగానే బిసిసిఐ సెలెక్టర్లు హడావిడిగా వచ్చే రెండు వన్డేలకు రాహుల్ ద్రావిడ్‌ను కెప్టెన్‌గా, వీరేంద్ర సెహ్వాగ్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించారు. గంగూలీ స్థానంలో తమిళనాడుకు చెందిన శ్రీధరన్ శ్రీరామ్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. బిసిసిఐ సెలెక్టర్లు ఐసిసి నుంచి రాతపూర్వక సమాచారం కూడా నిరీక్షించలేదు.












Click it and Unblock the Notifications