నక్సల్స్‌తో చర్చలను పునరుద్ధరించాలి: బిజెపి
హైదరాబాద్: నక్సలైట్లతో చర్చలను పునరుద్ధరించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నక్సలైట్ల చేతిలో హతమైన పార్టీ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం మహేందర్ గౌడ్ కుటుంబ సభ్యులను ఆయన శుక్రవారంనాడు పరామర్శించారు.
రాష్ట్రంలో చెలరేగుతున్న హింసకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. నక్సలైట్ల హత్యలు, పోలీసుల ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకుడు మహేందర్ గౌడ్ హత్యను బిజెపి ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. లక్ష్మణ్ విడిగా విలేకరుల సమావేశంలో ఖండించారు. ఒక వైపు హింస చెలరేగుతుంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు శాంతి యాత్ర ఏమిటని ఆయన అడిగారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications