చర్లపల్లి జైలు రికార్డులను పరిశీలించిన సిబిఐ
హైదరాబాద్: అనంతపురం జిల్లా పెనుకొండ తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసును విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు రికార్డులను పరిశీలించారు. రవి హత్యకు మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి ఇక్కడే పథకం రచించి, ఇక్కడి నుంచే దాన్ని అమలు చేశాడనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిబిఐ అధికారులు చర్లపల్లి జైలు రికార్డులను పరిశీలించారు. చర్లపల్లి జైలును సిబిఐ అధికారులు సందర్శించడం ఇది నాలుగోసారి.
జూబిలీహిల్స్ కారు బాంబు కేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆనంద రెడ్డి, వాసుదేవరెడ్డి, ప్రభాకర్ రెడ్డిలతో పాటు మరో ముగ్గురిని సిబి ఐ అధికారులు విచారించారు. జూబిలీహిల్స్ కారు బాంబు కేసులో మద్దెలచెర్వు సూర్యనారయణ రెడ్డితో పాటు వీరు శిక్ష అనుభవిస్తున్నారు.












Click it and Unblock the Notifications