హింసను వీడండి: నక్సల్స్‌కు కేశవరావు విజ్ఞప్తి
హైదరాబాద్: హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు నక్సలైట్లకు పిలుపునిచ్చారు. శాంతి ద్వారా మాత్రమే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. శాంతి సందేశ్ యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు.
నక్సల్స్ హింసతోపాటు అన్ని రకాల హింసను వ్యతిరేకిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు శాంతి సందేశ్ యాత్ర శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా తక్కెళ్లపల్లి గ్రామం నుంచి ప్రారంభమైంది. కేంద్ర యువజన సర్వీసుల మంత్రి సునీల్ దత్ ఈ యాత్రను ప్రారంభించారు. హింస వల్ల ప్రపంచంలో సాధించిందేమీ లేదనే సందేశంతో తాను పంజాబ్‌లో శాంతి యాత్ర చేసిన విషయాన్ని సునీల్ దత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కేశవరావు శాంతి సందేశ్ యాత్ర 18 రోజుల పాటు 18 జిల్లాల్లో సాగుతుంది. రోజుకు పది నుంచి 15 కిలోమీటర్ల ఈ యాత్ర సాగుతుంది. శుక్రవారంనాటి యాత్రలో చేవెళ్ల కాంగ్రెస్ శాసనసభ్యుడు సబితా ఇంద్రారెడ్డి, కె. రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ కేశవరావు వెంట పాదయాత్రలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications