కోచ్ ఎంపికలో నా పాత్ర లేదు: గంగూలీ
కోల్‌కత్తా: భారత జట్టు కొత్త కోచ్ ఎంపికలో తన ప్రమేయం ఏమీ లేదని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరబ్ గంగూలీ స్పష్టం చేశారు. లండన్‌కు బయలుదేరి వెళ్లే ముందు ఆయన బుధవారం కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. తనపై విధించిన నిషేధంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ఐసిసి)కి అప్పీల్ చేసే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసి ఐ)యే అని ఆయన అన్నారు. అయినా అప్పీల్ చేసుకోవడానికి జులై వరకు సమయం ఉన్నదని ఆయన చెప్పారు. తనకు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ చూడాలని ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications