ఇద్దరిని హత్య చేసిన నక్సలైట్లు
హైదరాబాద్: రాష్ట్రంలో నక్సలైట్లు ఇద్దరిని హత్య చేశారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జి. పుల్లెలచెరువు గ్రామంలో నక్సలైట్లు మొహియుద్దీన్ సాహెబ్ అనే వ్యక్తిని ఇన్‌ఫార్మర్ పేరుతో కాల్చి చంపారు. జనవరి నెలలో లతక్క ఎన్‌కౌంటర్‌కు బాధ్యుడంటూ మొహియుద్దీన్ సాహెబ్‌ను కాల్చి చంపామని నల్లమల ఈస్ట్ డివిజన్ జోనల్ కార్యదర్శి సాగర్ ప్రకటించారు.
మరొకరిని నల్లగొండ జిల్లాలో గొడ్డళ్లతో నరికి చంపారు. నల్లగొండ ఆలేరు మండలం టంగుటూరు గ్రామ సర్పంచ్ ధర్మాలును నక్సలైట్లు హత్య చేశారు. స్కూటర్‌పై వెళ్తున్న ధర్మాలును టాటా సుమోలో వచ్చిన నక్సలైట్లు గొడ్డళ్లతో నరికి చంపారు. స్కూటర్ వెనక కూర్చున్న వ్యక్తి నక్సలైట్లను చూడగానే పారిపోయాడు.












Click it and Unblock the Notifications