వరంగల్ జిల్లాలో ఇద్దరు నక్సల్స్ హతం
వరంగల్: వరంగల్ జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య బుధవారం సాయంత్రం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. మంగంపేట మండలం కమలాపూర్ సమీపంలోని అటీవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. మరణించిన నక్సలైట్లను చంచు రవి, డబ్బా రమేష్‌లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వీరిద్దరూ సిపియుయస్‌ఐకి చెందిన వారని తెలుస్తోంది. రవి సంపత్ దళానికి చెందిన కమాండర్ కాగా, రమేష్ దళ సభ్యుడని సమాచారం.












Click it and Unblock the Notifications