సిద్ధప్పపై దాడి: ట్రైనీ ఐపియస్ ఖురానా సస్పెన్షన్
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని రాజేంద్రనగర్‌లో పాన్‌షాపు యజమాని సిద్ధప్పపై దాడి చేసిన ఘటనలో ట్రైనీ ఐపియస్ అధికారి కేవల్ ఖురానాను సస్పెండ్ చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సిద్ధప్ప నెల రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఒక రోజు రాత్రి ట్రైనీ ఐపియస్ అధికారులు పాన్‌షాపు యజమాని సిద్ధప్పపై దాడి చేశారు. అంతేకాకుండా సిద్ధప్పపనై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై మీడియా తీవ్రంగా ప్రతిస్పందించి సిద్ధప్పకు అండగా నిలబడింది. ఈ ఘటనపై జాతీయ పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ విచారణ జరిపారు. ఈ విచారణ అనంతరం సిద్ధప్పపై దాడికి కారణం కేవల్ ఖురానానే అని భావించి ఆయనను సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications