విశాఖకు వోక్స్ వ్యాగన్ పోయింది: బాబు
విశాఖపట్నం: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే విశాఖకు వోక్స్ వ్యాగన్ కర్మాగారం రాకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆయన గురువారంనాడు విశాఖపట్పంలో పర్యటించారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. తమ హయాంలోనే విశాఖ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుని గట్టెక్చింంది తమ ప్రభుత్వమేనని ఆయన చెప్పుకున్నారు.
విశాఖపట్నాన్ని ముంబాయికి దీటుగా అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకున్నామని, విశాఖపట్నంలో ప్రత్యేక ఎకనమిక్ జోన్ ఏర్పాటుకు, పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కార్మికుల శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. 14 నెలల తర్వాత చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications