నవీష్ హత్య కేసు: రమణమూర్తిపై హత్యానేరం కేసు
విశాఖపట్నం: తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని భారత క్రికెట్ జట్టులో స్థానం లభించిన ఆంధ్రా క్రికెటర్ వేణుగోపాలరావు అన్నారు. శ్రీలంకలో ఈ నెల 30వ తేదీ నుంచి జరిగే ముక్కోణపు వన్డే సిరీస్‌కు ఎంపికైన జట్టులో వేణుకు స్థానం లభించింది. విశాఖపట్నం నుంచి భారతజట్టులో స్థానం లభించిన క్రికెటర్ వేణుయే కావడం గమనార్హం. వేణుగోపాల రావు బుధవారం విశాఖపట్నం తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం లభించింది.
భారతజట్టులో స్థానం లభించడం పట్ల తాను గొప్పగా ఫీలవుతున్నానని, తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఒకరిని పోటీగా భావించి తాను ఆడబోనని, తన సహజసిద్ధమైన ఆటనే ఆడుతానని ఆయన అన్నారు. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లో కూడా రాణించే ప్రయత్నం చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications