నవీష్ హత్య కేసు: జనహర్ష ఆఫీసులపై దాడులు
హైదరాబాద్: టిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ నవీష్ మూర్తి హత్య కేసులో ప్రధాన అనుమానితుడు రమణమూర్తికి చెందిన జరహర్ష కార్యాలయాలపై పోలీసులు దాడులు చేశారు. సికింద్రాబాద్‌లోని తార్నాకలో గల జనహర్ష ప్రధాన కార్యాలయంపై కూడా పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పోలీసుకలు కీలకమైన పత్రాలు లభించినట్లు చెబుతున్నారు. అయితే వాటి వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు. రమణమూర్తి కోసం, ఇతర అనుమానితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇదిలావుంటే, రమణమూర్తి రంగారెడ్డి జిల్లా కోర్టులో లొంగిపోతాడనే ప్రచారం గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఊపందుకుంది. దీంతో మఫ్టీ పోలీసులు అక్కడ మాటు వేశారు. పెద్ద యెత్తున మీడియా ప్రతినిధులు కూడా అక్కడ కాపు కాశారు. రమణమూర్తి చిక్కితే చాలా విషయాలు వెలుగు చూడగలవని పోలీసులు భావిస్తున్నారు. కాగా, నవీష్‌మూర్తి శవాన్ని ఉప్పల్‌లోని శ్రీనగర్‌కాలనీలో గల లింగయ్య ఇంటిలో పూడ్చిపెట్టడానికి పని చేసిన తాపీమేష్త్రీ శ్రీనివాసరావు అలియాస్ శ్రీనును పోలీసులు ప్రకాశం జిల్లాలో అరెస్టు చేసినట్లు మీడియా వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.












Click it and Unblock the Notifications