కాంగ్రెస్‌కు కెసిఆర్ దాసోహం: వరవరరావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు కాంగ్రెస్‌కు దాసోహమయ్యారని విప్లవ రచయితల సంఘం (విరసం) కార్యవర్గ సభ్యుడు, మావోయిస్టుల మాజీ ప్రతినిధి వరవరరావు విమర్శించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి, కెసి ఆర్‌కు మధ్య జరిగిన చర్చల ఫలితాల నేపథ్యంలో ఆయన గురువారం ఆ విమర్శ చేశారు. కెసిఆర్ తీరు చూస్తుంటే ఇందిరా గాంధీ హయాంలో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ విషయంలో వ్యవహరించిన తీరు గుర్తుకొస్తోందని ఆయన అన్నారు.
వైయస్‌తో జరిగిన చర్చల్లో జనశక్తి నేత రియాజ్ ఎన్‌కౌంటర్ ప్రస్తావనను కెసి ఆర్ తేకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. 610 జీవో అమలు విషయంలో పోలీసు అధికారుల పదోన్నతి విషయంలో అంగీకారానికి వచ్చిన కెసి ఆర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించాలనే డిమాండ్‌ను సాధించలేకపోయారని ఆయన అన్నారు. కెసి ఆర్ కాంగ్రెస్ చెప్పుచేతల్లోకి వెళ్లిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వదిలేయడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications