నవీష్‌ హత్యకేసు: రమణమూర్తి అరెస్టు

హైదరాబాద్‌:సంచలనం కలిగించిన నవీష్‌మూర్తిహత్యకేసులో ప్రధాన నిందితుడు,జనహర్ష గ్రూపు సంస్ధల అధినేతరమణమూర్తిని పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్టుచేశారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగాప్రకటించలేదు. రమణమూర్తిసైబరాబాద్‌ పరిధిలోని ఒక పోలీసు స్టేషన్‌కుతరలించి రహస్యంగా ఇంటరాగేట్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంజినీరునవీష్‌మూర్తికి, రమణమూర్తికికొన్నేళ్ళుగా రియల్‌ ఎస్టేట్‌ తగాదాలుఉన్నాయి. ఏడాదిన్నర క్రితం రమణమూర్తి జైభారత్‌ అనేసంస్ధ కార్యకర్తలను నవీష్‌ ఇంటికిపంపి అతని మీద దాడి చేయించాడు.నవీష్‌నుబాగా కొట్టి, గుండు చేయించి, అర్ధనగ్నంగాఊరేగించారు. గత శుక్రవారం రాత్రి నవీష్‌మూర్తిని కిడ్నాప్‌చేసిన రమణమూర్తి ఎల్‌బి నగర్‌లోని తనఫంక్షన్‌ హాలులో హత్య చేసినట్టు పోలీసులుప్రాధమిక సాక్ష్యాధారాలు సేకరించారు.నవీష్‌ మృతదేహాన్ని ఉప్పల్‌లోని ఒకఇంటికి తరలించి వంటగది పాట్‌ఫాంకింద శవాన్ని ఉంచి కాంక్రీటుతో మూసివేయించారు. అయినాదుర్గంధం వస్తోందని గ్రహించినఇరుగుపొరుగువారుఫిర్యాదు చేయడంతోరంగంలోకి దిగిన పోలీసులు ఒకరోజంతాకాంక్రీటు పగులగొట్టి మృతదేహాన్నివెలికి తీసి అది నవీష్‌మూర్తిదని గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+