ప్రాంతీయ తత్వాలు వద్దు: టిఆర్‌యస్‌తో పొన్నాల
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టవద్దని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్)కి విజ్ఞప్తి చేశారు. నిర్ణయాలు రాజకీయాలతో కాకుండా సాంకేతిక అంశాలతో ముడిపడి ఉంటాయని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
పులిచింతల ప్రాజెక్టు స్థలమార్పిడి విషయంలో టి ఆర్‌యస్ నేత ఎ. నరేంద్ర చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పులిచింతల ప్రాజెక్టు స్థలమార్పిడికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అంగీకరించారని నరేంద్ర ప్రకటించారు. దీనిపై మంత్రి ఆ విధంగా అన్నారు. పులిచింతల ప్రాజెక్టు స్థలమార్పిడిపై ప్రభుత్వపరంగా ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications