మన్యంమృతులపై టిడిపి కాకిలెక్కలు:జక్కంపూడి
హైదరాబాద్:మన్యం గిరిజన ప్రాంతంలో విష జ్వరాలవల్ల కేవలం ఏడుగురు మాత్రమేమరణించారని, ఈ విషయంలోతెలుగుదేశం పార్టీ చెబుతున్నవికాకిలెక్కలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి జక్కంపూడి రామ్మోహనరావుఅన్నారు. వయసు మీద పడి చనిపోయినవారిని కూడా టిడిపి వారు మలేరియా మృతుల్లోచేర్చుతున్నారని ఆయనఅన్నారు. చనిపోయే ప్రతి ఒక్కరి వద్దప్రభుత్వం కూర్చోవడం ఎలాసాధ్యమవుతుందని ఆయనప్రశ్నించారు.
మరోమంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ మన్యం విష జ్వరాలపైశ్వేత పత్రం విడుదల చేయాల్సినఅవసరం లేదన్నారు. చావుల విషయంలోమానవతా దృష్టితో వ్యవహరించాలేకానీ రాజకీయం చేయరాదని ఆయనప్రతిపక్షాలకు సూచించారు.












Click it and Unblock the Notifications