కరీంనగర్‌లో బాంబు పేలుడు: 15 మందికి గాయాలు

కరీంనగర్‌: కరీంనగర్‌ బస్‌ స్టేషన్‌లో మంగళవారం ఉదయం బాంబు పేలింది. ఆర్టీసి సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ బాంబు పేలుడు సంఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురు కరీంనగర్‌ - 2 డిపోకు చెందిన ముగ్గురు డ్రైవర్లు, ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రుల్లో 8 మందిని వరంగల్‌లోని యంజియం ఆస్ప6తికి తరలించారు. బాంబు పేలుడు కారకులెవరనేది ఇప్పుడే చెప్పలేమని జల్లా పోలీసు సూపరింటిండెంట్‌ చౌహాన్‌ చెప్పారు.

కరీంనగర్‌ బస్‌స్టేషన్‌లోని ఐదు, ఆరు ప్లాట్‌ఫారాలపై ముంబాయి, నిజామాబాద్‌లకు వెళ్లే బస్సులు నిలుచుని ఉన్నాయి. ఈ రెండు బస్సులకు మధ్య టిఫిన్‌ బాక్స్‌లోంచి పొగలు రావడం గమనించి ఆర్టీసి సిబ్బంది పెద్దగా కేకలు పెట్టారు. దీంతో ప్రయాణికులు దూరంగా పారిపోయారు. టిఫిన్‌ బాక్స్‌లోని బాంబు పేలింది. ఈ ఘటనలో రెండు బస్సుల అద్దాలు పగిలిపోయాయి. ఒక బస్సు టైర్‌ పగిలిపోయింది. ఇటువంటి తరహా బాంబులను అమర్చడం ఐయస్‌ఐకి అలవాటని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+