బిసికి అధ్యక్ష పదవి ఇస్తారా?: బాబుకు కెకె సవాల్
హైదరాబాద్: పార్టీ అధ్యక్షపదవిని వెనకబడిన తరగతులకు (బిసీలకు) చెందిన నాయకుడికి అప్పగించగలరా అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు సవాల్ విసిరారు. బిసి రిజర్వేషన్లపై చంద్రబాబునాయుడు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబు నాయుడు అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ముస్లిమ్ రిజర్వేషన్ల వ్యవహారం కోర్టులో ఉండగా చంద్రబాబు నాయుడు అనవసర వ్యాఖ్యలు చేస్తూ కోర్టు తీర్పును ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఏర్పాటయిన కార్యక్రమంలో కేశవరావు పాల్గొని ప్రసంగించారు. స్వార్థాన్ని విడనాడి ప్రతి ఒక్కరూ దేశసేవకు అంకితం కావాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పదవులు శాశ్వతం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications