వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫారెస్ట్‌ హిల్స్‌ టైటిల్‌ పోరులో సానియా ఓటమి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ టెన్నిస్‌ తార సానియా మీర్జా ఫారెస్ట్‌ హిల్స్‌ ఉమెన్స్‌ టెన్సిస్‌ క్లాసిక్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల ఫైనల్‌లో ఓటమి పాలయింది. చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి లూసీ సఫరోవా చేతిలో సానియా పరాజయం పాలైంది. థర్డ్‌ సీడ్‌ సానియా సఫరోవా చేతిలో 6-3, 5-7, 4-6 స్కోర్‌తో ఓడిపోయింది. టైటిల్‌ గెలుచుకున్న సఫరోవాకు 22 వేల డాలర్లు లభించగా, రన్నర్‌ అప్‌ సానియాకు 12 వేల డాలర్లు లభించాయి.

ఫైనల్‌కు చేరుకునేవరకు సానియా ఒక్క సెట్‌ను కూడా కోల్పోలేదు. మొదటి రౌండ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన షహార్‌ పీర్‌పై, క్వార్టర్‌ ఫైనల్‌లో ఇటలీకి చెందిన రాబర్టా విన్సిపై విజయం సాధించింది. సెమీ ఫైనల్‌లో అమెరికాకు చెందిన 15 యేళ్ల అలెక్సా గ్లాచాపై 6-4, 6-4 స్కోర్‌తో విజయం సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో సాధించిన విజయాలతో సానియా ర్యాంక్‌ 42కు చేరుకుంది. అంతకు ముందు ఆమె 50వ ర్యాంక్‌ సాధించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X