కర్నూలులో దోపిడీ దొంగల స్వైరవిహారం

కర్నూలు: కర్నూలులోని బృందావన్‌ నగర్‌ కాలనీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించి నగలు, నగదు దోచుకెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో దాదాపు 20 మంది దోపడీ దొంగలు కర్నూలు, నంద్యాల జాతీయ రహదారి పక్కన ఉన్న బృందావన్‌నగర్‌ కాలనీలోకి ప్రవేశించారు. వాజ్‌మన్‌ను బెదిరించారు. కాలనీలోకి ప్రవేశించిన తర్వాత మూడు బృందాలుగా విడిపోయి బీభత్సం సృష్టించారు. కత్తులు, బాంబులతో బెదిరించారు.

ఒక బృందం ఎయిర్‌ఫోర్స్‌ మాజీ ఉద్యోగి వెంకటేశ్వర్లు ఇంటిలోకి తలుపులు బద్దలు కొట్టి చొరబడి బీభత్సం సృష్టించారు. ఇంటి సభ్యులను బెదిరించి నగలు, నగదు దోచుకెళ్లారు. ఇంటిలో వేసి కిరోసిన్‌ పోసి దగ్ధం చేస్తామని వారు కుటుంబసభ్యులను బెదిరించారు. కత్తులు, బాంబులతో బెదిరించారని, తనను కత్తితో పొడవడానికి ప్రయత్నించారని వెంకటేశ్వర్లు చెప్పారు.

మరో బృందం ప్రభుత్వ అధికారులు శ్రీనివాస రెడ్డి, నాగిరెడ్డి ఇళ్లప దాడి చేశారు. వారి ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ దొంగలు పారిపోయిన 15 నిమిషాల్లోనే పోలీసులు వచ్చారు. దోపిడీ దొంగలు ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందినవారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం నాలుగు లక్షల నగలు, నగదు దోచుకెళ్లినట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+