తెలంగాణకు పర్యాయపదమే ఆంధ్ర: లెఫ్ట్
హైదరాబాద్: తెలంగాణకు పర్యాయపదమే ఆంధ్ర రాష్ట్రమని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని సిపిఐ, సిపియం ఆదివారం సంయుక్తంగా నిర్వహించాయి. కమ్యూనిస్టుల్లో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ తెలంగాణ, ఆంధ్ర అని పేర్లు పెట్టి విద్వేషాలను సృష్టించడాన్ని కలిసి వ్యతిరేకిస్తాయని ఆయన అన్నారు.
ఎందరి త్యాగాల ఫలితంగానో వెల్లువెత్తిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్), బిజెపిలు వక్రీకరిస్తున్నాయని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు ఆన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మతసామరస్యాన్ని వారసత్వంగా అందించిందని ఆయన అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ కలిసి పోరాటం చేశాయని ఆయన చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర వేర్వేరు కావని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications