చెరువు తూముకు గండి: నిజామాబాద్ జలమయం
నిజామాబాద్: నిజామాబాద్ పట్టణానికి మంచినీరందించే రఘునాథ చెరువు తూము తెగిపోవడంతో దాని కింది కాలనీ జలమయయైంది. కాలనీలో ఐదు వేల ఇళ్లు మునిగిపోయాయి. పదివేల ఇళ్లు జలమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు నాలుగేళ్లుగా చెరువు వర్షాభావంతో నీరు లేక ఎండిపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల చెరువులోకి నీరు వచ్చింది. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి ఆహార పదార్థాలు అందిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి. శ్రీనివాస్ బాధితులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications