తెలంగాణవాదులను గెలిపించాలి: విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) అగ్రనేత కె. చంద్రశేఖర్ రావు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో పది వార్డులు గెలిచినా తాను తన పదవికి రాజీనామా చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఎపియస్ ఆర్టీసి) చైర్మన్ గోనె ప్రకాశరావు సవాల్ చేశారు. తన సవాల్‌ను చంద్రశేఖర్ రావు స్వీకరించాలని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు.
టి ఆర్‌యస్ తాను చెప్పినన్ని సీట్లు గెలవకపోతే కెసి ఆర్ రాజీనమా చేయాలని ఆయన అన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పది వార్డులు కూడా గెలవకపోతే చంద్రశేఖర్‌రావు మంత్రపదవికి, లోక్‌సభ సభ్వత్యానికి రాజీనామా చేయాలని ఆయన అన్నారు. చంద్రశేఖర్ రావు అక్రమ నిధుల సేకరణ, అరాచకాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ పేర మీదు చంద్రశేఖర్ రావు, ఆయన అల్లుడు పదవులు పొందారని ప్రకాశరావు అన్నారు.












Click it and Unblock the Notifications