నష్టం రూ. 1200 కోట్లపైనే: ప్రభుత్వ నివేదిక
హైదరాబాద్: తుఫాను, వరదల తాకిడి వల్ల రాష్ట్రంలో 1200 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ అంచనాలతో గవర్నర్ సుశీల్‌కుమార్ షిండే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు నివేదికను సమర్పించారు. బుధవారం రెండు గంటల లోగా రాష్ట్ర ప్రభుత్వాధికారులు నివేదికను రూపొందించి తిరుపతిలో ప్రధాని వెంట ఉన్న గవర్నర్‌కు ఫాక్స్ ద్వారా పంపారు.
తుఫాను, వరద తాకిడి రాష్ట్రంలోని 369 మండలాల్లోని 3,537 గ్రామాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికలో తెలియజేసింది. వరి, చెరుకు, అరటితోటలు నష్టపోయినట్లు తెలిపారు. వరదలకు 56 మంది మరణించినట్లు ప్రభుత్వం ఆ నివేదికలో తెలియజేసింది. తుఫాను, వరదల తాకిడికి 1200 నుంచి 1300 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లి ఉంటుందని అధికార వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి.












Click it and Unblock the Notifications