శాస్త్ర, సాంకేతిక రంగాల్లో లీడర్లం: మన్మోహన్
తిరుపతి: పేదరిక నిర్మూలనకు ఇస్రో ప్రయోగాలను సమర్థంగా వాడుకోవాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. శ్రీహరికోటలోని షార్ ప్రాంగణంలో ఆయన బుధవారంనాడు సతీష్ ధావన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గత 30 ఏళ్లుగా ఇస్రో చేసిన అవిరళ కృషితో ఎంతో సాధించామని, తద్వారా ఇస్రో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిందని ఆయన అన్నారు. బుధవారం ఉదయం ఆయన తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయంలో దిగి నేరుగా శ్రీహరికోటకు వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ సుశీల్ కుమార్ షిండే స్వాగతం పలికారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనమే లీడర్లమని, తద్వారా మనం అంతర్జాతీయ కీర్తిప్రతిష్టలను అందుకుంటున్నామని ఆయన అన్నారు. అనంతరం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications