నెల్లూరు జిల్లాలో చెలరేగిన కక్షలు: ఒక వ్యక్తి మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం పట్టపుపాలెం గ్రామంలో ఇరు పక్షాల పరస్పర దాడుల్లో ఒక వ్యక్తి మరణించగా, 13 మంది గాయపడ్డారు. గాయపడినవారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. పాతకక్షల కారణంగానే ఈ దాడులు జరిగినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు.
యాదగిరి, నర్సింహులు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య చాలాకాలంగా కక్షలున్నాయి. గతంలో హైకోర్టు జడ్జి జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఆ తర్వాత చాలా కాలం శాంతంగానే ఉన్నారు. అయితే హఠాత్తుగా గురువారం ఈ కక్షలు దాడులకు దారి తీశాయి.












Click it and Unblock the Notifications