గోదావరి నదికి మళ్లీ వరద ముప్పు
హైదరాబాద్: గోదావరి నదికి మళ్లీ వరద ముప్పు పొంచి ఉంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో గోదావరి నీటి ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. నాసిక్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాందేడ్ జిల్లాలో కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. నాందేడ్‌లో కూడా భారీగా వర్షాలకు కురుస్తున్నాయి.
ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండింది. దీంతో ఎస్ ఆర్‌యస్‌పి నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. మరో 24 గంటల్లో ఇక్కడ మరింతగా వరద ఉధృతి పెరగవచ్చునని భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా భద్రచాలం వద్ద కూడా నీటి మట్టం పెరుగుతోంది. ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలున్నట్లు అధికారవర్గాలు చెప్పాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని అధికారులు ఆదేశించారు.












Click it and Unblock the Notifications