విశాఖకు మళ్లీ వాయుగుండం ముప్పు
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల విశాఖపట్నానికి మళ్లీ ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు అంటున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్నంలో మూడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గురువారం జరగాల్సిన లెక్కల త్రైమాసిక పరీక్షను వాయిదా వేశారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో ఆకాశం మేఘావృతమై ఉంది. వాయుగుండం ప్రభావం వల్ల ఉత్తర కోస్తా తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఆవకాశం ఉంది. మరో 24 గంటలకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలంగాణ జిల్లాలపై కూడా పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications