గుంటూరులో కాంగ్రెస్‌కు రాయపాటి తలనొప్పి
గుంటూరు: గంటూరు మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాయపాటి సాంబశివరావు వర్గం తీవ్ర అసంతృప్తితో తమ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. గుంటూరు కార్పోరేషన్ మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకత్వం సహకార శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ కుమారుడు కన్నా నాగరాజు పేరును ఖరారు చేసింది. దీనిపై రాయపాటి వర్గం అసంతృప్తితో ఉంది.
గుంటూరులో కార్పోరేటర్‌గా రాయపాటి సాంబశివరావు కుమారుడు కూడా ఎన్నికయ్యాడు. దీంతో నాగరాజు ఎంపిక ఏ మాత్రం రాయపాటి వర్గానికి నచ్చడం లేదు. దీంతో రాయపాటి వర్గం గుంటూరు వన్ శాసనసభ్యుడు సుభాని నివాసంలో సమావేశమవుతోంది. కార్పోరేటర్ల అభిప్రాయాలను సేకరించేందుకు ఈ సమావేశంలో ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications