మైనారిటికీ టిజెయస్ నేతృత్వం: తెరాస
హైదరాబాద్: తెలంగాణ జాగరణ సేన నేతృత్వాన్ని మైనారిటీ వ్యక్తికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకత్వం నిర్ణయించింది. టిజెయస్ ఛీఫ్ కమాండర్‌గా నియమితులైన ఉమాకాంత రావు రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌యస్‌యస్)కు చెందిన వారు కావడంతో నష్టం జరిగిందనే అభిప్రాయంతో ఈ మార్పునకు తెరాస నడుం కట్టినట్లు అర్థమవుతోంది. టిజెయస్ ఛీఫ్ కమాండర్ మార్పు విషయాన్ని తెరాస నేత, మాజీ మంత్రి విజయరామారావు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు.
టిజెయస్‌ను రద్దు చేసే ప్రసక్తి లేదని, తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఈ సంస్థ పని చేస్తుందని ఆయన చెప్పారు. పార్టీలో సంక్షోభం తలెత్తిందనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు. అధిష్ఠానంపై బహిరంగ విమర్శలు చేసిన శాసనసభ్యులు మందాడి సత్యనారాయణ రెడ్డిపై, దుగ్యాల శ్రీనివాస రావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం లేదని ఆయన చెప్పారు. వారిద్దరితో తమ అధినేత కె. చంద్రశేఖర్‌రావు సమావేశమవుతారని ఆయన చెప్పారు.
మందాడి సత్యనారాయణ రెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావులతో పాటు మరో ఇద్దరు పార్టీ శాసనసభ్యులతో తెరాస అగ్రనేత కె. చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications