గౌర వెంకటరెడ్డికి క్షమాబిక్షపై సుప్రీం షోకాజ్
హైదరాబాద్: శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టడంపై సుప్రీంకోర్టు సోమవారంనాడు రాష్ట్ర ప్రభుత్వానికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆరు కేసుల్లో ఆరోపణలున్న గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టడాన్ని ఇద్దరు వ్యక్తులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. వీరు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
గౌరు వెంకటరెడ్డికి క్షమాబిక్ష పెట్టడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ప్రతిపక్ష సభ్యులు వివరణ కోరగా, షోకాజ్ నోటీసును చూసిన తర్వాత తాము తగు విధంగా ప్రతిస్పందిస్తామని హోం మంత్రి కె. జానారెడ్డి సోమవారంనాడు శాసనసభలో చెప్పారు. ఎనిమిది కేసుల్లో నిందితుడైన గౌరు వెంకటరెడ్డికి ఎలా క్షమాబిక్ష పెడతారని సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు దాట వేశారు. కోబ్రాలను ఎట్టి పరిస్థితిలోనూ సహించబోమని, వారు ఎంతటివారైనా సమర్థంగా ఎదుర్కుంటామని, ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications