కృష్ణా నీటి తరలింపుపై ఆందోళన: టిడిపి
హైదరాబాద్: రాయలసీమలోని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 40వేల క్యూసెక్కుల కృష్ణా నది జలాలను తరలించే నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తాము శాసనసభలో ఆందోళన చేస్తామని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు దేవినేని ఉమామహేశ్వర రావు, కరణం బలరామకృష్ణమూర్తి, కె. సుబ్బారాయుడు చెప్పారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు కృష్ణా జలాలను తరలిస్తూ జారీ చేసిన 170 నెంబర్ జీవో వెంటనే రద్దు చేయాలని వారు సోమవారం మీడియా ప్రతినిధుల వద్ద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ చర్య వల్ల ఐదు జిల్లాల్లో స్థిరీకృత డెల్టాకు అన్యాయం జరుగుతుందని వారన్నారు. వరద నీరు పేరుతో కృష్ణా జలాలను కడప జిల్లాకు తరలించేందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి నడుం కట్టారని వారన్నారు. రాజశేఖర్ రెడ్డి కడప జిల్లా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు కృష్ణా జలాలను తరలించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, అందుకు సంబంధించిన పనులకు కూడా పాలనాపరమైన అనుమతులు ఇచ్చారని వారన్నారు.












Click it and Unblock the Notifications