విజయవాడ కార్పోరేషన్ హస్తగతం
విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ హస్తగతమైంది. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసి మేయర్ పదవిని దక్కించుకోవడానికి కావాల్సిన మెజారిటీని సంపాదించుకుంది. విజయవాడ నగర పాలక సంస్థ డివిజన్లకు జరిగిన ఫలితాలు సోమవారం ఉదయం వెలువడ్డాయి. 59 డివిజన్లున్న కార్పోరేషన్‌లో కాంగ్రెస్ 29 స్థానాలు దక్కించుకుంది.
తెలుగుదేశం పార్టీ పది స్థానాలకు దక్కించుకోగా, కాంగ్రెస్ మిత్ర పక్షాలైన సిపి ఐకి 9 స్థానాలు, సిపియంకు 8 స్థానాలు దక్కాయి. ముగ్గురు స్వతంత్రులు గెలిచారు. వీరిలో ఒకరు తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు అభ్యర్థి కాగా, మరో ఇద్దరు కాంగ్రెస్‌కు చెందినవారు. వరదల కారణంగా విజయవాడ కోర్పోరేషన్‌లోని కొన్ని డివిజన్లకు సెప్టెంబర్ 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు సోమవారం జరిగింది.












Click it and Unblock the Notifications