పురందేశ్వరికి కేంద్రంలో కీలక పదవి..!?
ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయం పై కీలక మంత్రాంగం సాగుతోంది. కేంద్రం కేబినెట్ ప్రక్షాళన.. బీజేపీ లోనూ మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. పలువురు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇదే సమయంలో దక్షిణాదికి ఈ సారి ప్రాధాన్యత దక్కనుంది. తెలంగాణ, ఏపీ నుంచి కేబినెట్ లో కొత్తగా అవకాశం దక్కనుంది. ఇక.. బీజేపీ ఎంపీ పురందేశ్వరికి కీలక బాధ్యతలు దక్కనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.
కేంద్ర కేబినెట్.. బీజేపీ నాయకత్వంలోనూ కీలక మార్పుల దిశగా కసరత్తు చేస్తోంది. తెలంగాణ.. ఏపీ లో బీజేపీ పట్టు పెంచుకునే విధంగా కొత్త నిర్ణయాలకు సిద్దమైంది. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన లో ఏపీ.. తెలంగాణ కు ప్రాధాన్యత దక్కనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఏపీలో ప్రస్తుతం టీడీపీ నుంచి ఇద్దరు.. బీజేపీ నుంచి ఒకరు మంత్రులుగా ఉన్నారు. వీరిలో రామ్మోహన్ నాయుడను వియాన యాన శాఖ నుంచి కీలక శాఖకు మార్పు చేయనున్నట్లు సమాచారం. సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసానికి స్వతంత్ర శాఖ దక్కనుంది. దీంతో.. ఏపీ నుంచి కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన కు ఈ సారి మంత్రి పదవి దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఏపీ బీజేపీ ఎంపీల్లో మరొకరికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీకి ప్రాధాన్యత
ఇక, రాజమండ్రి నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన పురందేశ్వరికి ఈ సారి కీలక బాధ్యతలు దక్కటం ఖాయమని చెబుతున్నారు. కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని చెబుతున్నా... లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కుతుందని పార్టీ నేతల అంచనాగా ఉంది. గతంలో యూపీఏ-1 , యూపీఏ-2 ప్రభుత్వాల హయాంలో పురందేశ్వరి ఏకంగా పదేళ్ల పాటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి , వాణిజ్య-పరిశ్రమల శాఖలకు సహాయ మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుత లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. మహిళను లోక్ సభ స్పీకర్ గా నియమించాలి అని నిర్ణయిస్తే.. పురందేశ్వరి పేరు పరిశీలించే ఛాన్స్ ఉందని సమాచారం. లోక్ సభలో ప్రస్తుతం ఉన్న సమీకరణాల్లో ఓం బిర్లాను మార్పు చేయకుంటే.. పురందేశ్వరిని డిప్యూటీ లోకసభ స్పీకర్ గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీకి ఈ పదవి ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో.. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఏపికి ఖాయంగా కనిపిస్తోంది. ఈ పదవి టీడీపీకి దక్కితే.. పురందేశ్వరి కేంద్ర మంత్రి అవుతారని పార్టీ నేతల సమాచారం.













Click it and Unblock the Notifications