ముఖేష్ అంబానీకి పెద్దపల్లి కోర్టు ఆర్డర్స్
కరీంనగర్: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మున్సిపల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 5వ తేదీన తమ ముందు హాజరు కావాలని పెద్దపల్లి కోర్టు ముఖేష్ అంబానీకి ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్ బంక్ కేటాయింపులో మోసం చేశారంటూ ఒక వ్యక్తి వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
పిటిషన్ తరఫు న్యాయవాది మాటల ప్రకారం- రెండేళ్ల క్రితం రిలయన్స్ ప్రతినిధులు రంగనాథ్ అనే వ్యక్తి వద్దకు వచ్చి అతనికి సంబంధించిన భూమిని పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం అడిగారు. పెట్రోల్ బంక్‌లో వాటా ఇస్తామని చెప్పారు. దాంతో అతను తక్కువ ధరకు తన భూమిని రిలయన్స్‌కు ఇచ్చాడు. అయితే పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసిన తర్వాత రిలయన్స్ ఆ వ్యక్తికి వాటా ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications